హైదరాబాద్, అర్జున్ సమాచారం:
సమాఖ్య బిజినెస్ సమ్మిట్-2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, యువత మరియు మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహంపై అయన ఆలోచనలను పంచుకున్నారు.
దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 5 శాతం నుంచి 10 శాతానికి పెంచే దిశగా ముందుకు సాగుతున్నాం. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే మా లక్ష్యంమని అన్నారు.
తెలంగాణ అభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలి. మీ పెట్టుబడులకు మా ప్రభుత్వం భరోసా ఇస్తుంది. మనమంతా కలిసి తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యాన్ని సాధిద్దామని పిలుపునిచ్చారు. .
=====================